‘రాహుల్ గాంధీ’కి గోరుముద్దలు తినిపిస్తే అన్యాయమా?: శ్రవణ్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 420 హామీలిచ్చి వాటిని అమలుచేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా యువతను నయవంచనకు గురిచేస్తున్నారని అన్నారు. ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేయడం సమంజసం కాదని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ భవన్ లో  పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

ఉద్యోగాల భర్తీపై నాయకులు ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని.. ఇలా చేయడంప్రజాస్వామ్యమా? అని శ్రవణ్ ప్రశ్నించారు. తమ పార్టీ నాయకులపై దాడి చేసే హక్కు ఎవరిచ్చారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్‌ నాయకులు బట్టలు విప్పి 150 దేశాల ముందు రాష్ట్ర పరువు తీశారని.. కానీ ఒక హోటల్‌లో తమ నాయకులు రాహుల్‌ గాంధీ ఫొటోకు గోరుముద్దలు తినిపిస్తూ నిరసన తెలిపితే అన్యాయమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నాయకుల నిరసనలకు ఒక న్యాయం, ప్రతిపక్షాల నిరసనలకు మరో న్యాయమా? ఇదేం ద్వంద వైఖరి అంటూ నిలదీశారు. యువతకు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాల హామీ, నిరుద్యోగుల సమస్యలు, తమ నాయకులపై దాడులపై రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>