క్రికెట్‌పై పొలిటికల్ సెగ.. మ్యాచ్‌ల వేదికలు మార్చిన పీసీబీ!

కలం, స్పోర్ట్స్: పాక్ (Pakistan) క్రికెట్‌కు పొలిటికల్ సెగ తగిలింది. పీటీఐ పాలనలోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లో కేంద్ర ప్రభుత్వం అత్యవసర పరిస్థితితో పాటు గవర్నర్ పాలనను విధించింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ కేబినెట్ ప్రతిపాదనలకు దేశ అధ్యక్షుడు ఆమోదం తెలపడంతో అక్కడ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో మ్యాచ్‌ల నిర్వహణపై భద్రతా ఆందోళనలు వ్యక్తమవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) రంగంలోకి దిగింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రెసిడెంట్స్ ట్రోఫీ గ్రేడ్-1 ఫస్ట్ క్లాస్ టోర్నీ మ్యాచ్‌లను ఆ ప్రావిన్స్ నుంచి వేరే ప్రాంతాలకు మార్చుతున్నట్లు పీసీబీ ప్రకటించింది.

పిషావర్‌లోని ఇమ్రాన్ ఖాన్ స్టేడియం, అబోతాబాద్ క్రికెట్ స్టేడియంలలో జరగాల్సిన మ్యాచ్‌లను తక్షణమే రద్దు చేసింది. వాటి స్థానంలో షేక్‌పురా, లాహోర్‌లను కొత్త వేదికలుగా ఖరారు చేసి, అక్టోబర్ 14 నుంచి మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం షేక్‌పురాలోని రాణా నవీద్ అకాడమీలో ఘనీ జట్టు, హైదరాబాద్ కింగ్స్‌మెన్‌తో తలపడనుంది. లాహోర్‌లోని ఎల్‌సిసిఎ మైదానంలో సుయ్ నార్తర్న్ గ్యాస్ పైప్‌లైన్స్, ఆయిల్ అండ్ గ్యాస్ డెవలప్‌మెంట్ జట్లు ఆడనున్నాయి.

అయితే ఇస్లామాబాద్, రావల్పిండి వేదికల్లో పాత షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు కొనసాగుతాయని స్పష్టం చేసింది. లీగ్ దశ ముగింపునకు చేరుకున్న తరుణంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. టోర్నీ ఆఖరి రౌండ్ మ్యాచ్‌లను ఒక రోజు వాయిదా వేసి అక్టోబర్ 19 నుంచి నిర్వహించనున్నారు. లాహోర్‌లో మార్ఖోర్ ఐటీ, పాకిస్థాన్ టీవీ మ్యాచ్ జరగనుండగా, ఇస్లామాబాద్‌లో హైదరాబాద్ కింగ్స్‌మెన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ తలపడనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>