పద్మశాలీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌: తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘం, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన పద్మశాలీ విద్యార్థులకు (Padmashali Students) ప్రతిభా పురస్కారాలు పంపిణీ చేశారు. ఆదివారం నగరంలోని అయ్యప్ప కొండ పద్మావతి కాలనీలో ఉన్న‌ శ్రీ శివ మార్కండేయ దేవాలయంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. జిల్లా అధ్యక్షులు కెంచె సుభాష్ చంద్ర, ఉమ్మడి మహబూబ్‌న‌గ‌ర్‌ జిల్లాకు చెందిన పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, నీట్, ఐఐటీ, ఎన్ఐటీ ప్రవేశ పరీక్షలో, ఇతరత్రా ఉన్నత విద్యల్లో అత్యధిక మార్కులతో రాణించిన దాదాపు 50 మందికి బాలబాలికలకు సర్టిఫికెట్, మెమెంటోలను అందజేశారు. అదేవిధంగా ఉత్తమ ఉద్యోగులుగా అవార్డు పొందిన ఉద్యోగులకు, ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు, పదవీ విరమణ చేసిన విశ్రాంత పద్మశాలీ ఉద్యోగస్తులకు, జిల్లాలోని వివిధ హోదాల్లో పని చేస్తున్న పద్మశాలీ ఉద్యోగులకు శాలువా కప్పి మెమెంటో ద్వారా సన్మానించారు. అనంతరం వన భోజనాలు చేశారు.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు, ఆలె బాలకృష్ణ, టీపీయూఏస్ స్టేట్ సెక్ర‌టరీ కురి సత్యనారాయణ, సిరందాస్, సంఘం రాష్ట్ర ప్రతినిధులు హాజరయ్యారు. సంక్షేమ పథకాలు గత కొన్ని సంవత్సరాల నుండి పద్మశాలీ ఉద్యోగుల సంఘం నుండి అందజేయడం జరుగుతుందని, పేద విద్యార్థులలో ప్రతిభావంతులకు, పై చదువుల నిమిత్తం ఆర్థిక సహాయ సహకారాలు, పేద పద్మశాలీలకు వైద్య పరంగా , ఆర్థికంగానూ చేయూతను కూడా చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా పానుగంటి బాలరాజ్, అఖిల భారతీయ పద్మశాలీ సంఘం కార్యదర్శి, శ్రీ అప్పం అనంతరములు, జిల్లా ప్రెసిడెంట్, ర్రాష్ట్ర జిల్లా కార్యవర్గ ప్రతినిధులు కుకుడాల బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి, కడుదాసు శ్రీనివాసులు, అరుపుల దివాకర్, ధర్మపురి సునీల్ కుమార్, వస్త్రాల ఆంజనేయులు, మాకం శ్యామ్ సుందర్, పల్లాటి రఘురాములు, కుకుడాల శ్రీనివాస్, జన్ను వెంకటస్వామి, గుర్రం క్రిష్ణయ్య, పాలాది కరుణ, బీంపల్లీ శ్రీనివాసులు, కెంచె రామచంద్రయ్య,కెంచె మహేష్ కుమార్, బోగం వెంకటేశ్, దాసు వెంకటేష్, పల్లాటి బాల్రరాజ్, కోడి రాజశేఖర్, కోగంరి వెంకటేష్, సత్యనారాయణ, బిజ్జు శంకర్, సుకుమార్, శివాజి, జన్ను వెంకటేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>