Mobile Popup Ad
Mobile Popup Ad

భద్రాద్రి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు.. మంత్రులకు ఆహ్వానం

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం (Bhadrachalam) రాములవారి కల్యాణం ఈ నెల 27న జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలయ ఈఓ దామోదర్ రావు, ఆలయ ఉప ప్రధాన అర్చకులు శ్రీనివాస రామానుజం, ఆలయ సిబ్బంది శనివారం రాష్ట్ర మంత్రులకు (Ministers) ఆహ్వానం పలికారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందించారు. అనంతరం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.

అలాగే ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ.. భద్రాచలం సీతారాముల కల్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు తరలివస్తారని, అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశామన్నారు.

Read Also: హోటళ్లు రెస్టారెంట్లకు గుడ్ న్యూస్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>