Mobile Popup Ad
Mobile Popup Ad

ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్ ‘ఊసరవెల్లి’ గ్రాండ్ రీ-రిలీజ్

కలం, సినిమా : మే 20 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ప్రత్యేక ట్రీట్ సిద్ధమైంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ప్రథ్యంగిరా సినిమాస్, ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘ఊసరవెల్లి’(Oosaravelli) సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

మే 19, 20 తేదీలలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రీ-రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా గ్లోబల్ ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ స్క్రీనింగ్స్‌ను ప్లాన్ చేశారు. అంతేకాకుండా, ఈ చిత్రాన్ని 4K క్వాలిటీలో అప్‌గ్రేడ్ చేసి ప్రదర్శించే అవకాశముందని సమాచారం. 2011లో విడుదలైన ‘ఊసరవెల్లి’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తమన్నా భాటియా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, ట్విస్టులు, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.

ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు భారీగా  ప్లస్ అయింది. ఈ చిత్రంలోని పాటలు అప్పట్లో చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ‘టోనీ’ పాత్రలో ఎన్టీఆర్ నటన అభిమానులకు ఇప్పటికీ ప్రత్యేకంగా గుర్తుండిపోయింది. ఈ స్పెషల్ స్క్రీనింగ్స్ ప్రకటించడంతో సోషల్ మీడియాలో అభిమానులు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఐకానిక్ సీన్స్, డైలాగ్స్‌ను షేర్ చేస్తూ ‘ఊసరవెల్లి’ సినిమాను మరోసారి థియేటర్లలో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>