అయోధ్య ట్రస్ట్ సీఈవోగా జితేంద్ర మిశ్రా!

క‌లం, వెబ్‌డెస్క్‌: అయోధ్య రామ్ మందిర్ ట్ర‌స్ట్ నూత‌న‌ సీఈవోగా జితేంద్ర మిశ్రా (Jitendra Mishra) నియ‌మితుల‌య్యారు. జితేంద్ర మిశ్రా గ‌తంలో 39 ఏళ్ల పాటు ఎయిర్ మార్ష‌ల్‌గా సేవ‌లు అందించారు. ఆప‌రేష‌న్ సిందూర్ స‌మ‌యంలో వెస్ట్ర‌న్ ఎయిర్ క‌మాండ్‌కు నాయ‌క‌త్వం వ‌హించారు. ఈ ప‌ద‌వి కోసం 5585 ద‌ర‌ఖాస్తులు రాగా క‌మిటీ క్షుణ్ణంగా ప‌రిశీలించి మిశ్రాను సీఈవోగా ఎంపిక చేసింది. అయోధ్య‌ రామాల‌య ట్ర‌స్ట్ స‌మావేశంలో క‌మిటీ ఈ నిర్ణ‌యం తీసుకుంది.

ఇకపై రామ్ మందిర్ పరిపాలన, నిర్వహణతో పాటు రాబోయే ఏర్పాట్ల బాధ్యతలను జితేంద్ర మిశ్రా పర్యవేక్షించనున్నారు. అయోధ్య రామ మందిరాన్ని నిర్వహిస్తున్న ట్రస్ట్‌లో విరాళాలకు సంబంధించి అవకతవకలు జ‌రిగాయ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జితేంద్ర మిశ్రా నియామకం ప్రాధాన్యత‌ను సంతరించుకుంది.

Also Read : తిలక్ వర్మ మెరుపులు.. దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్ జోన్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>