చెక్‌ బౌన్స్‌ కేసు.. ఎన్‌ఆర్‌ఐకి ఏడాది జైలు, రూ.80 లక్షల ఫైన్​

కలం, జనగామ : చెక్‌ బౌన్స్‌ కేసు (Cheque Bounce Case)లో ఎన్‌ఆర్‌ఐ తాడిశెట్టి వెంకట్రావుకు జనగామ ప్రిన్సిపల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ శశి ఏడాది జైలు శిక్ష, రూ.80 లక్షల జరిమానా విధించారు. బక్క నాగరాజు దాఖలు చేసిన నాలుగు చెక్‌ బౌన్స్‌ కేసుల్లో విచారణ అనంతరం మంగళవారం కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

ప్రతి కేసులో రూ.20 లక్షల జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధించినట్లు న్యాయవాది శ్రీరామ్‌ శ్రీనివాస్‌ తెలిపారు. పిటిషనర్‌ తరఫున సరైన ఆధారాలు, సాక్ష్యాలను కోర్టులో దాఖలు చేయగా, వాటిని పరిశీలించిన అనంతరం మేజిస్ట్రేట్‌ నిందితుడికి శిక్ష ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. పిటిషనర్‌ బక్క నాగరాజు తరఫున న్యాయవాది శ్రీరామ్‌ శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు.

Also Read : కేసీఆర్ చెప్పినా కవిత వినలేదు: ప్రశాంత్ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>