నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ చిత్రా మిశ్రా

కలం, కరీంనగర్ బ్యూరో: మే మూడో తేదీన జరగనున్న నీట్ ఎగ్జామ్ (NEET 2026 Exam)కు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra) ఆదేశించారు. చిన్న పొరపాటుకు ఆస్కారం ఇవ్వవద్దని సూచించారు. నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహణపై మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో పలువురు అధికారులు కేంద్రాల చీఫ్ సూపరిండెంట్ల విద్య వైద్య పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కరీంనగర్ (Karimnagar)లో ఏడు కేంద్రాల్లో నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరుగుతుందని అన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు. తాగునీటి వసతితో పాటు టాయిలెట్స్ ఇతర సదుపాయాలు కల్పించాలనీ, ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా పోలీస్ అధికారులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించాలని సూచించారు.

సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలని అధికారులంతా సమన్వయంతో ఎంట్రెన్స్ ఎగ్జామ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషి చేయాలని పేర్కొన్నారు. మే మూడో తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుందని తెలిపారు. ఆ రోజు 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారని చెప్పారు. విద్యార్థులు ఒరిజినల్ గుర్తింపు కార్డు ఆధార్ కార్డుతో హాజరుకావాలని తెలిపారు. మొబైల్ ఫోన్ తో పాటు ఇతర ఏ వస్తువులకు అనుమతి లేదని పేర్కొన్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుందని విద్యార్థులు నియమ నిబంధన కచ్చితంగా పాటించాలని సూచించారు.

అన్ని రకాలుగా ఏర్పాట్లు పక్కాగా చూసుకోవాలని విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరిం చాలని పేర్కొన్నారు. ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్, మహిళా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, ఆలుగునూరులోని కేంద్రీయ విద్యాలయం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్, కరీంనగర్ ఉజ్వల పార్కు సమీపంలో ఉన్న బాలికల పాలిటెక్నిక్ కళాశాల, చింతకుంట ఎస్సీ రెసిడెన్షియల్ స్కూలు, కేబుల్ బ్రిడ్జి సమీపంలోని మైనార్టీ స్కూల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, డి శ్రీనివాస్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఏసిపి వాసాల సతీష్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ పంకజ్ కుమార్, ఆయా కేంద్రాల చీఫ్ సూపరిండెంట్లు, విద్య వైద్యశాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read Also: ‘విమానాలు ఆపేస్తాం’.. ఎయిర్‌లైన్స్ సంస్థల హెచ్చరిక

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>