కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad ) స్నేహా సొసైటీలో అందుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి సొసైటీ కార్యదర్శి సిద్దయ్య ఆధ్వర్యంలో బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్లు శివ సత్తులు బోనాలు ఎత్తుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. చేతుల్లో వేప కొమ్మలు పట్టుకొని ఊగిపోయారు.
ఆషాడం మాసంలో తెలంగాణ రాష్ట్రంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే బోనాల జాతర స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ – స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ఈ సారి కూడా ఘనంగా జరిగింది. తారకరామ నగర్ లోని అందుల ప్రత్యేక పాఠశాల నుండి నుండి పోలేరమ్మ మందిరం వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్బంగా ట్రాన్స్ జెండర్లు శివసత్తులు బోనాలు ఎత్తుకున్నారు. అందుల పాఠశాల నుంచి మొదలుకొని పోలేరమ్మ గుడి వరకూ ఆడుతూ పాడుతూ సందడి చేశారు.
వారు బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేశారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేసి బోనాలు సమర్పించారు. స్నేహా సొసైటీ చల్లగా ఉండాలని ఇలాగే అందుల మానసిక వికలాంగులు అభాగ్యులకు సేవ చేయాలని ట్రాన్స్ జెండర్లు సిద్దయ్య, జ్యోతి లను ఆశీర్వదించారు. 2014 నుంచి కమ్యూనిటీ ఈవెంట్స్ చేస్తున్నామని, ఇలాంటి పండుగలు ఉత్సవాల వల్ల ఆనందం వెల్లివిరుస్తుందని స్నేహా సొసైటీ కార్యదర్శి సిద్దయ్య అభిప్రాయ పడ్డారు.

