కలం, నిజామాబాద్ బ్యూరో: వినాయక చవితి పండుగను పురస్కరించుకొని కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిజామాబాద్ (Nizamabad) జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉచిత మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పర్యావరణానికి కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని, పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రజలకు అడిషనల్ కలెక్టర్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా 8 అంగుళాల మట్టి గణపతులను ఉచితంగా అందించి పర్యావరణంపై పెద్ద ఎత్తున అహగహన కార్యక్రమాలు TGPCB నిర్వహించడం జరిగిందని పర్యావరణ ఇంజనీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భుజంగారావు, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ రవిదాస్ , జూనియర్ అసిస్టెంట్ సిబ్బంది పాల్గొన్నారు..

