కలం, వెబ్‌డెస్క్: కూకట్‌పల్లిలోని ట్రక్ పార్క్ (Kukatpally Truck Park) భూములను ప్రభుత్వం త్వరలో వేలం వేయనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఆందోళనలను తీవ్రం చేసింది. ఈ మేరకు నేడు కూకట్‌పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిరసనకారులను చెదరగొట్టారు. ఇదిలా ఉండగా మాధవరం కృష్ణా రావు ఈ భూముల వేలంపై హైకోర్టును ఆశ్రయించారు. భూముల వేలాన్ని ఆపాలంటూ పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ త్వరలో విచారణకు రానుంది.
కూకట్పల్లి ట్రక్ పార్క్ కోసం రైతులు, దళితులు తమ భూములను ఇచ్చారని మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. ఈ భూములకు 500కు పైగా ట్రక్కులు పార్కింగ్ చేసుకునే సామర్థ్యం ఉందన్నారు. ఇప్పుడు ఈ భూములను వేలం వేస్తే భవిష్యత్తులో ట్రక్కులను పార్క్ చేసుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసమే ట్రక్ పార్క్ భూములను వినియోగించాలని, వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27న హెచ్ఎండీఏ కూకట్పల్లి ట్రక్ పార్క్ భూములను వేలం వేయనుంది. తాజా పిల్‌తో హైకోర్టు ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాలి.

