గ్రాడ్యుయేట్ ఓటర్లకు బిగ్ అలర్ట్.. చెక్ చేసుకోండి!

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల (Graduate MLC Elections)కు సంబంధించిన ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎన్నికల కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో 11,89,191 లక్షల మంది ఓటర్లను అర్హులుగా గుర్తించారు. 80,635 మంది దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. అప్లై చేసుకున్నవారు ఎన్నికల సంఘం వెబ్ సైట్‌లోకి వెళ్లి వివరాలు చెక్ చేసుకోవచ్చు. మళ్లీ అభ్యంతరాలు స్వీకరించడంతో పాటు పేర్ల నమోదుకు డిసెంబర్ 10వ తేదీ వరకు గడువు విధించారు. ఈ రోజు నుంచి డిసెంబర్ 10 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఒకవేళ పాత జాబితాలో పేరున్నా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

ఓటర్ల జాబితా వివరాలిలా..

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి మొత్తం 6,70,407 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ మూడు జిల్లాల పరిధిలోని 192 మండలాల పరిధిలో 6,21,086 మంది దరఖాస్తులను ఆమోదించగా.. 49,321మంది అప్లికేషన్లను తిరస్కరించారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎన్నికకు సంబంధించి 156 మండలాల్లో 5,99,419 మంది దరఖాస్తు చేసుకోగా.. 5,68,105 మందివి ఆమోదించారు. 31,314 మంది ఓటర్ల దరఖాస్తులను తిరస్కరించారు. ఓటర్ల జాబితా వెలువడిన తరువాత ఎన్నికల సంఘం పోలింగ్ తేదీలను ప్రకటించబోతుంది. 2027 మార్చి లోపే ఎన్నికలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>