కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం పాలిటెక్నిక్ డిప్లమా కాలేజీలను, ఐటిఐ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ – శక్తి ప్రేమ్ వర్క్ కింద విలీనం చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని పీడీఎస్‌యూ నిజామాబాద్ నగర అధ్యక్షులు సిర్రం పవన్ కుమార్ (Nizamabad PDSU) డిమాండ్ చేశారు. సిటీలో పీడీఎస్‌యూ నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ముందు విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 97ను తీసుకువచ్చి సాంకేతిక విద్యను ప్రైవేట్ పరం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. పేద మధ్యతరగతి విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు రోహిత్, శ్రీజన్ రెడ్డి, వంశీ, శ్రీనిధి, సంకీర్తన రెడ్డి, వర్షిణి, రాజ్, తదితరులు పాల్గొన్నారు.

