కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad)లో టీఎన్జీవో సభ్యత్వ నమోదు (TNGO Membership)ను కలెక్టరేట్ జిల్లా విద్యాశాఖ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. టీఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ ఆదేశానుసారం సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ లు పాల్గొన్నారు.
ఆయా శాఖల ఉద్యోగుల సమస్యలపై చర్చించిన అనంతరం,2026-27 గాను టీఎన్జీవో సభ్యత్వాన్ని సదరు శాఖ ఉద్యోగులకు అందించారు. టీఎన్జీవో సభ్యత్వం ప్రాముఖ్యతను వివరించి, ఇతర సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి, ఉద్యోగుల సమస్యలే పరమావధిగా భావిస్తున్న టీఎన్జీవో సంఘం, ప్రతి ఉద్యోగికి ఎళ్లవేళల్లో అందుబాటు ఉంటూ అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా కోశాధికారి నిరంజన్ గౌడ్, ఉపాధ్యక్షులు శివకుమార్, టీఎన్జీవో అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, విద్యాశాఖ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు అశ్విన్ కుమార్, శోభన్, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్ వ్యవసాయ శాఖ ఫోరం జిల్లా కార్యదర్శి గోవర్ధన్ ఆయా శాఖల ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు హాజరై టీఎన్జీవో సభ్యత్వాన్ని స్వీకరించారు.

