కలం, నిజామాబాద్ బ్యూరో: విపత్తులు సంభవించిన సమయాల్లో ఆపద మిత్ర వాలంటీర్లు (Aapda Mitra Volunteers) తక్షణమే స్పందిస్తూ సహాయక చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ వి. భుజంగరావు సూచించారు. నిజామాబాద్ (Nizamabad) కలెక్టరేట్లో బుధవారం ఆపద మిత్ర వాలంటీర్లకు విపత్తు సహాయక కిట్లు పంపిణీ చేశారు. విపత్తుల సమయాలలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఉపకరించే 14 రకాల వస్తువులతో కూడిన ఈ కిట్‌ను ఎలా ఉపయోగించాలి అనే విషయాల గురించి ఎస్డీఆర్ఎఫ్ అధికారులు తెలియజేశారు.
విపత్తులు సంభవించిన సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆస్తి, ప్రాణ నష్టాన్ని ఎలా నివారించాలి, అత్యవసర సమయాలలో ప్రాథమిక చికిత్స పద్ధతులు, సీపీఆర్ చేసే విధానం, తదితర అంశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో గీత, కలెక్టరేట్ డీ-సెక్షన్ ఇన్ ఛార్జ్ శ్రీనివాస్ రావు, ఆర్ఎస్ఐ శ్రీనివాస్, అగ్నిమాపక శాఖ, 7వ పోలీసు బెటాలియన్ అధికారులు, ఆపద మిత్ర వాలంటీర్లు (Aapda Mitra Volunteers) పాల్గొన్నారు.
Read Also: తుంగతుర్తి ఇష్యూపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్
Follow Us On: Sharechat

