తుంగతుర్తి ఇష్యూపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్న నల్లగొండ జిల్లా తుంగతుర్తి (Thungathurthi) రాజకీయంపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా స్పందించింది. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో ఖర్గే, ఇతర ముఖ్య నేతలు తెలంగాణ రాజకీయాలపై చర్చించారు. ఇందులో భాగంగా నల్లగొండ రాజకీయాలపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందించాలని రాష్ట్ర నాయకత్వాన్ని హైకమాండ్ ఆదేశించింది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, ఆ పదవికి సంబంధించిన అంశాలపై అంతర్గతంగా చర్చకొచ్చాయి. పార్టీ నేతలు ఎవరూ లైన్ దాటి వ్యవహరించవద్దని హైకమాండ్ హెచ్చరించినట్టు తెలుస్తోంది.

Read Also: తెలంగాణ సాగునీటి రంగానికి ఊరట.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>