కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది.. దీంతో పొలిటికల్ సర్కిల్‌లో అప్పుడే మేయర్ అభ్యర్థిపై నిజామాబాద్ లో జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ కవితా రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కవితా రెడ్డికి మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మద్దతు ఉంది. వృత్తి పరంగా డాక్టర్. కాంగ్రెస్ పార్టీలో మేయర్ సీటును ఆశిస్తున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.
అనుకున్నట్టు గానే జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో కవితా రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటు బీజేపీ నుంచి గతంలో ఫ్లోర్ లీడర్ అయిన స్రవంతి రెడ్డి మేయర్ రేసులో ముందువరుసలో ఉన్నారు. స్రవంతి రెడ్డికి నిజామాబాద్ (Nizamabad) ఎంపీ ధర్మపురి అరవింద్ మద్దతు ఉంది.. స్రవంతి రెడ్డి బీజేపీ లో యాక్టివ్ గా ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ లో తన గళం వినిపించారు. ఆందోళనల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక వ్యాపారవేత్త దినేష్ రెడ్డి భార్య స్రవంతి, సరళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
కార్పొరేషన్ మేయర్ (Corporation Mayor) స్థానం జనరల్ మహిళలకు కేటాయించడంతో నిజామాబాద్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. గత రెండు పర్యాయాలు బీఆర్‌ఎస్ మేయర్లు ఉన్నారు. అధికారం కోల్పోయిన ఆ పార్టీ పరిస్థితి ఈసారి ఎలా ఉంటుందోననేది చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో కవితా రెడ్డి వర్సెస్ స్రవంతి రెడ్డి గా పాలిటిక్స్ మారే పరిస్థితులున్నాయి. నిజామాబాద్ లో ఫిక్స్ డ్ సీట్లు సాధించే ఎంఐఎం ఈసారి కీలకంగా మారనుంది. చేయికి ఆపన్నహస్తం అందించే వ్యూహాలు కనిపిస్తున్నాయి.
Read Also: రూ.3900 కోట్లు చెల్లించండి.. ప్రభుత్వానికి బేవరేజెస్ కంపెనీల రిక్వెస్ట్
Follow Us On: Sharechat


