కలం, నిర్మల్: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన వెయ్యి రోజుల ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ (Nirmal Congress) ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు శుక్రవారం తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు గాంధీ పార్క్ నుంచి కాంగ్రెస్ శ్రేణులతో బైక్ ర్యాలీ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

