పెండింగ్‌ కేసుల పరిష్కారంలో జాప్యం వద్దు: ఎస్పీ జానకి షర్మిల

కలం, నిర్మల్‌ : ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, పటిష్టమైన సాక్ష్యాధారాలు సేకరించి నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.

జిల్లాలో నేరాల నియంత్రణ, పెండింగ్‌ కేసుల (Pending Cases) పరిష్కారం, దర్యాప్తు పురోగతి, సీసీటీఎన్‌ఎస్‌ నిర్వహణ, మహిళలు, బాలల భద్రతతో పాటు రాబోయే దసరా, బతుకమ్మ పండుగల భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. దసరా, బతుకమ్మ పండుగలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ముందస్తు భద్రతా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రద్దీ ప్రాంతాల్లో నిఘా పెంచి ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, మహిళలు, బాలల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

అనంతరం ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు వాహనాలను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సమావేశంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్‌, నిర్మల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐలు కృష్ణ, గోవర్ధన్‌ రెడ్డి, సమ్మయ్య, సత్యనారాయణ, ప్రవీణ్‌, సాయికుమార్‌, రవీందర్‌ నాయక్‌, దీపక్‌, మల్లేష్‌, వివిధ పోలీస్‌ స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలు, డీసీఆర్‌బీ, ఐటీ కోర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>