రాజ్యాంగ స్ఫూర్తితో విధులు నిర్వహించాలి: ఎస్పీ జానకి షర్మిల

కలం, నిర్మల్: రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ తమ విధులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల(Janaki Sharmila) అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ అధికారులతో కలిసి రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. అందులో పొందుపరిచిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి మౌలిక విలువలను గౌరవిస్తూ వాటిని నిత్యజీవితంలో ఆచరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛను కల్పించడంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదిగా నిలుస్తోందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకున్నప్పుడే సమసమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగం సూచించిన విలువలకు అనుగుణంగా విధులు నిర్వహిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>