ఐపీఎల్‌ 2027పై సీఎస్‌కే ఫోకస్‌.. మరో కోచ్‌ రాక!

క‌లం, స్పోర్ట్స్: ఐపీఎల్‌ 2027 కోసం చెన్నై సూపర్ కింగ్స్‌ కోచింగ్ బృందంలో మార్పులు కొనసాగుతున్నాయి. తాజాగా, ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గారెత్ బాటీ (Gareth Batty) ని బ్యాటింగ్ కోచ్‌గా తీసుకునే దిశగా సీఎస్‌కే చర్చలు జరుపుతోంది. ఈ విషయాన్ని జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ ధ్రువీకరించారు. సంప్రదింపులు కొనసాగుతున్నాయని, మరో రెండు రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 49 ఏళ్ల గారెత్ బాటీ ఇంగ్లండ్ తరఫున 9 టెస్టులు, 10 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ ఆడారు. ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ జట్టు సర్రేకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.

ఆయన కోచింగ్‌లో సర్రే వరుసగా మూడు కౌంటీ ఛాంపియన్‌షిప్‌ టైటిళ్లు గెలుచుకుంది. జహీర్ ఖాన్‌తోనూ బాటీకి మంచి పరిచయం ఉంది. వీరిద్దరూ గతంలో వోర్సెస్టర్‌షైర్‌ తరఫున కలిసి ఆడారు. ఇప్పటికే ఐపీఎల్‌ 2027 కోసం సీఎస్‌కే మాజీ భారత పేసర్‌ జహీర్ ఖాన్‌ను హెడ్ కోచ్‌గా నియమించింది. 16 ఏళ్లపాటు జట్టుకు కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో జహీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు, మాజీ భారత పేసర్‌ మోహిత్ శర్మ బౌలింగ్ కోచ్‌గా చేరడం కూడా ఖరారైంది. బాటీ నియామకంపై అధికారిక ప్రకటన వస్తే సీఎస్‌కే కోచింగ్ బృందంపై మరింత స్పష్టత రానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>