డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి: డీకే అరుణ

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేసేది కాదని మహబూబ్‌న‌గ‌ర్‌ ఎంపీ డీకే అరుణ (DK Aruna) అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ, ఉట్కూర్, మక్తల్ మండలాల్లోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మండలం కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో కోటి 56 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. గతంలో కృష్ణ మండలం కర్ణాటకకు దగ్గరగా ఉండటంతో వైద్యం కోసం కర్ణాటక వెళ్లేవారని, ప్రస్తుతం ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో ఇక్కడ ప్రజలు ఇక్కడే వైద్యం చేసుకునే విధంగా వెసులుబాటు కలిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి కనిపిస్తుందని ఆమె తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయారని ఆమె ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో చేపడుతున్న ఇందిరమ్మ గృహాల్లో కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారని, అర్హత కలిగిన బీజేపీ కార్యకర్తలకు ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు,. మక్తల్ రోడ్లకు గతంలో అనేకసార్లు మంత్రులు శంకుస్థాపనలు చేసినప్పటికీ పనులు పూర్తి చేయలేదన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని నిలువురాళ్లకు ప్రపంచ స్థాయి గుర్తింపు తేవడానికి ప్రయత్నిస్తానని ఆమె తెలిపారు. బీమా, సంఘం బండ రిజర్వాయర్లతో ఈ ప్రాంతానికి సాగునీరు అందించాలని ప్రయత్నించింది చిట్టెం నర్సిరెడ్డి అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కృష్ణా మండలంలోని మురహరిదొడ్డిలో పది లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సంఘ నూతన భవనాన్ని ప్రారంభించారు. మక్తల్ మండలం ఉప్పరపల్లిలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని, ఊటుకూరులో 10 లక్షల ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో కామన్ షెడ్ నిర్మించి ప్రారంభించడం జరిగింద‌న్నారు. అలాగే పెద్ద జెట్రంలో అంగన్వాడీ కేంద్రం, గ్రామపంచాయతీ భ‌వ‌నాల‌ను ప్రారంభించినట్టు ఆమె తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>