కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల (SP Janaki Sharmila) పై కొంతమంది స్వార్థపూరిత శక్తులు చేస్తున్న ఆరోపణలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని, వాస్తవాలకు దూరంగా ఉన్నాయని నిర్మల్ జిల్లా పోలీస్ సంక్షేమ సంఘం తేల్చి చెప్పింది. వాస్తవాలను వక్రీకరిస్తూ ఎస్పీపై దుష్ప్రచారం చేయడం సరికాదని పేర్కొంటూ సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ జానకి షర్మిలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది.
సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం
జిల్లాలో 20 ఏళ్లకు పైగా మచ్చలేని సర్వీస్ కలిగిన మహిళా ఐపీఎస్ అధికారిణిగా ఎస్పీ జానకి షర్మిల సేవలందిస్తున్నారని పోలీస్ సంక్షేమ సంఘం పేర్కొంది. పోలీస్ సిబ్బందికి వ్యక్తిగత, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదురైతే నేరుగా ఎస్పీని కలసి తమ సమస్యలను వివరించే అవకాశం కల్పించారని తెలిపింది. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై పరిపాలనాపరంగా బదిలీలు లేదా శాఖాపరమైన చర్యలు తీసుకోవడం సహజమైన ప్రక్రియేనని, వాటిని వ్యక్తిగత కక్షలుగా చిత్రీకరించడం సరికాదని తెలిపింది.
పోలీస్ సిబ్బంది, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్మల్‌తో పాటు ప్రతి బుధవారం భైంసాలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు సంఘం వెల్లడించింది. సమస్యలను నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పించడం ద్వారా సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం పోలీస్ సిబ్బందిపై ఆర్థిక భారాన్ని తగ్గించే ఉద్దేశంతో కో ఆపరేటివ్ లోన్ సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని రూ.975 నుంచి రూ.500లకు తగ్గించారని సంక్షేమ సంఘం తెలిపింది. అంతేకాకుండా అర్హత ఉన్న సిబ్బందికి రూ.3 లక్షల వరకు రుణం మంజూరు అయ్యేలా చర్యలు తీసుకున్నారని పేర్కొంది.
పోలీస్ సిబ్బంది, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్మల్‌తో పాటు ప్రతి బుధవారం భైంసాలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు సంఘం వెల్లడించింది. సమస్యలను నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పించడం ద్వారా సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపింది. హోంగార్డుల సంక్షేమం కోసం రెయిన్కోట్లు, ఫంక్షన్ హాల్, క్యాంటీన్ వంటి సౌకర్యాలను కల్పించినట్లు పోలీస్ సంక్షేమ సంఘం తెలిపింది. అలాగే వార్షిక సాధారణ బదిలీలను కూడా ఎస్పీ వ్యక్తిగత నిర్ణయాలుగా చూపించడం తగదని పేర్కొంది. పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం ఎన్నికలను ASP (భైంసా) ఆధ్వర్యంలో సీక్రెట్ బ్యాలెట్ విధానంలో పారదర్శకంగా నిర్వహించినట్లు సంఘం తెలిపింది. ఇలాంటి ఎన్నికలకు కులం, మతం రంగు పులమడం సిగ్గుచేటని తీవ్రంగా ఖండించింది.
IIIT బాసర విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి
బాసర IIIT విద్యార్థుల భద్రత విషయంలో ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని సంఘం తెలిపింది. విద్యార్థులు ఆమెను ఆప్యాయంగా “అమ్మ” అని పిలుచుకునేంతగా వారికి అండగా నిలుస్తున్నారని పేర్కొంది. అలాంటి అధికారిణిపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం బాధాకరమని సంఘం అభిప్రాయపడింది.
అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలే కారణమా?
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఎస్పీ కఠిన చర్యలు తీసుకుంటున్నారని సంక్షేమ సంఘం పేర్కొంది. ఈ చర్యలతో నష్టపోయిన కొంతమంది వ్యక్తులే పోలీసుల పేరుతో అనామక లేఖలు సృష్టించి ఎస్పీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది.
నిరాధార ప్రచారాలను నమ్మొద్దు
సోషల్ మీడియాల్లో, లేదంటే ఇతర మార్గాల్లో ప్రచారం అవుతున్న ఆధారాలు లేని ఆరోపణలను ప్రజలు, పోలీస్ సిబ్బంది నమ్మవద్దని పోలీస్ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. వాస్తవాలను నిర్ధారించుకోకుండా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం వల్ల వ్యక్తుల ప్రతిష్ఠకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. ఎస్పీపై నిరాధార ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ సంక్షేమ సంఘం హెచ్చరించింది. ఎస్పీ జానకి షర్మిల(SP Janaki Sharmila)కు తమ పూర్తి మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేసింది.
Also Read : కొండా సురేఖకు కీలక పదవి?: హైకమాండ్ పిలుపు!
Follow Us On: X(Twitter)

