15 ఏళ్లుగా నిరంతరాయంగా మట్టి విగ్రహాల పంపిణీ.. మహేష్ గుప్తా కీలక పిలుపు

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy)లోని అశోక్ నగర్ అభయాంజనేయ స్వామి సంఘం గల్లీ ఆర్యవైశ్య అధ్యక్షులు విశ్వనాథుల మహేష్ గుప్తా అధ్యక్షతన మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేశారు. అశోక్ నగర్ కాలనీతో పాటు కామారెడ్డి పట్టణ ప్రజలు పలువురు గణపతులు తీసుకున్నారు. గత 15 సంవత్సరాలుగా ఉచిత మట్టి గణపతులను విశ్వనాథుల మహేష్ గుప్తా అందిస్తున్నారు. మట్టి వినాయకుల వలన పర్యావరణ కాలుష్యాన్ని జల కాలుష్యం నివారించినవాళ్లం అవుతాం అని ఈ సందర్భంగా మహేష్ గుప్తా అంటున్నారు. అందరూ మట్టి గణపతులు ప్రతిష్టించాలని ఆయన కోరారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>