నిర్మల్ పోలీస్ శాఖలో ముగ్గురికి పదోన్నతి

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న 1990 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) అభినందించారు. మామడ పోలీస్ స్టేషన్‌కు చెందిన చంద్రప్రకాష్, నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన చంద్రశేఖర్, సోన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సాయన్నలకు ఏఎస్ఐలుగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ వారిని అభినందించారు.

పోలీస్ శాఖలో సుదీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు అందించిన సేవలను ఎస్పీ ప్రశంసించారు. పదోన్నతి తమ కృషి, అంకితభావానికి లభించిన గుర్తింపుగా భావించాలని సూచించారు. నూతన హోదాలో మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. పదోన్నతి పొందిన సిబ్బంది తమ అనుభవాన్ని ఉపయోగించుకుని పోలీస్ శాఖకు మరింత సేవలందించాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>