కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం లేదని పోలీసులు చెబుతున్నప్పటికీ, ఇటీవల పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సుమారు 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన సమత (Kakarala Samatha) తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. సుదీర్ఘకాలం మావోయిస్టు కార్యకలాపాల్లో పనిచేసిన ఆమె జనజీవనంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఈ పరిణామం నేపథ్యంలో ముప్పల లక్ష్మణరావు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ఇతర సభ్యులు కూడా హింసా మార్గాన్ని వీడాలని తెలంగాణ డీజీపీ ఆనంద్ పిలుపునిచ్చారు. సమత లొంగుబాటు నేపథ్యంలో రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాల పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది.

