MRPS కమిటీల నిర్మాణానికి కృషి: గుడాల స్వామి మాదిగ

కలం, నిర్మల్: ఎమ్మార్పీఎస్ (MRPS), ఎంఎస్పీ నూతన కమిటీల నిర్మాణానికి నాయకులు కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి గుడాల స్వామి మాదిగ పిలుపునిచ్చారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో నిర్వహించిన జిల్లా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ మూడు దశాబ్దాలుగా చేసిన పోరాటం చారిత్రాత్మకమని కొనియాడారు. సెప్టెంబర్ 9న వరంగల్‌లో నిర్వహించే నూతన కమిటీల భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. గ్రామ, మండల స్థాయిలో కమిటీల నిర్మాణాన్ని బలోపేతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు పాల్గొన్నారు.

Read Also: ప్రపంచ పులుల దినోత్సవం.. స్టూడెంట్స్‌కి చిత్రలేఖన పోటీలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>