కలం, నిర్మల్ రూరల్: నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన మల్లారెడ్డి, ముజ్గి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే బీజేపీ కార్యకర్తలు(BJP Workers) అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) మంగళవారం వారిని పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతూ, వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా కల్పించారు.

