లోక్ అదాలత్‌ లో 2636 కేసుల పరిష్కారం

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో మొత్తం 2,636 కేసులు పరిష్కరించబడినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక తెలిపారు. జిల్లాలోని మూడు కోర్టుల పరిధిలో నిర్వహించిన ఈ లోక్ అదాలత్‌ లో నిర్మల్‌ లో 14 సివిల్ కేసులు, 1599 క్రిమినల్ కేసులు, భైంసాలో 581 క్రిమినల్ కేసులు, ఖానాపూర్ లో 442 కేసులు పరిష్కరించారని వెల్లడించారు. ప్రజలు చిన్నచిన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్‌ లు మంచి వేదికగా ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బదులు ఒకేసారి లోక్‌ అదాలత్‌ లో కేసులను పరిష్కరించుకుంటే సమయం, డబ్బు వృథా కాకుండా పోతుందని తెలిపారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>