కలం, నిర్మల్: ఉపాధ్యాయులు ఆధునిక బోధన పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను మెరుగుపరచేందుకు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న (DEO Bhojanna) అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని నారాయణ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మూడు రోజుల సమీకృత విద్య ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యారంగంలో వస్తున్న మార్పులను ఉపాధ్యాయులు విద్యార్థులకు చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోర్స్ కోఆర్డినేటర్ వెంకట రమణారెడ్డి, జిల్లా రిసోర్స్ పర్సన్స్ శశిరాజ్, ధీరజ్, చంద్రప్రకాశ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

