కాళోజీ సాహిత్యం ప్రజల్లో చైతన్యం నింపింది: అదనపు కలెక్టర్

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌ (Nirmal Collectorate) లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి (Kaloji Narayana Rao Jayanti) వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు (Venkateshwarlu) పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సాధారణ ప్రజానీకానికి అర్థమయ్యేలా తెలంగాణ యాసలో ఎన్నో కవితలు రచించి, ప్రజలను చైతన్యపరిచిన గొప్ప వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. కాళోజీ సేవలకు కేంద్ర ప్రభుత్వం 1992లో పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించిందని చెప్పారు. ఆయన జన్మదినాన్ని తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. కాళోజీ లాంటి గొప్ప వ్యక్తుల జయంతులను అధికారికంగా నిర్వహించుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు.

ఈ జయంతి వేడుకల్లో డీఆర్ఓ రాథోడ్ రమేష్, బీసీ, ఎస్సీ సంక్షేమ అధికారులు శ్రీనివాస్, దయానంద్, హార్టికల్చర్ అధికారి రమణ, ఎల్డీఎం రామ్ గోపాల్, ఇతర అధికారులు, పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>