కలం, నిర్మల్ : ఖేలో ఇండియా (Khelo India) యూత్ గేమ్స్ -2026 ప్రచార గోడప్రతులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌పై జిల్లాలో విస్తృత ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేలా గ్రామీణ ప్రాంతాల వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, వెంకట మాధవ రావు, డీఆర్ఓ రాథోడ్ రమేష్, ఆర్డీఓ దేవీదాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

