కలం, స్పోర్ట్స్: సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీ సూపర్ లీగ్‌లో కర్ణాటక ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్ (Shreyanka Patil) మెరుపు హాఫ్‌సెంచరీతో అదరగొట్టింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన ఆమె, తన దూకుడుతో ఇన్నింగ్స్‌ను పూర్తిగా మార్చివేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 12.1 ఓవర్లలో 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో ఒత్తిడిని దరిచేరనివ్వని శ్రేయాంక, ఎదురుదాడికి దిగి అద్భుతమైన హాఫ్‌సెంచరీ సాధించింది.
ఆమె పోరాటంతో కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది. ఈ టోర్నీలో శ్రేయాంక అటు బ్యాట్‌తోనూ, ఇటు బాల్‌తోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే 9 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీసి టోర్నీలో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్న ఆమె, బ్యాటింగ్‌లోనూ తన సత్తా చాటుతోంది. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో మరోసారి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన శ్రేయాంక, త్వరలో జరగనున్న ఇంగ్లాండ్-ఎ సిరీస్ కోసం ఇండియా-ఎ జట్టులోనూ చోటు దక్కించుకుంది.

