వన మహోత్సవం, వర్షాలపై నిర్మల్ కలెక్టర్ కీలక ఆదేశాలు

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో సమావేశ మందిరంలో బుధవారం కలెక్టర్ భవేశ్ మిశ్రా (Nirmal Collector) కీలక అంశాలపై సమీక్ష నిర్వహించారు. వన మహోత్సవం, జలసిరి ఫామ్ పాండ్‌ల నిర్మాణం, ఇందిరమ్మ ఇండ్లు, తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వన మహోత్సవం లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు.

మండలాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలు, శాఖల వారిగా నాటే మొక్కలు, ఇతర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలసిరి ఫామ్ పాండ్‌ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. గ్రామపంచాయతీల వారిగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఫామ్ పాండ్‌ల నిర్మాణ వివరాలు సమీక్షించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్షించారు.

నిజమైన అర్హుల పేర్లు ఎల్ 3 జాబితాలో ఉన్నట్లయితే అధికారులు ధృవీకరించి, వారికి ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు చేపట్టాలని వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) అనుమతులకు సంబంధించి క్షేత్రస్థాయి ధృవీకరణ, గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరణ, డెస్క్ ధ్రువీకరణ ప్రక్రియలు పారదర్శకంగా చేపట్టాలన్నారు. జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ (Nirmal Collector) తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, వాగుల సమీపంలోకి పశు కాపరులు, మత్స్యకారులు, ఇతరులెవరూ వెళ్లకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, హౌసింగ్ పీడీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవోలు, ఇతర అధికారులు, పాల్గొన్నారు.

Read Also: స్వర్ణ ప్రాజెక్టు గేటు మొరాయింపు.. తాళ్లతో కట్టిన అధికారులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>