ఢిల్లీ ఘటన.. ఏసీపీ కుటుంబం న్యాయపోరాటం

కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలో జులై 20న సీజేపీ  నిరసనల (CJP Protest Clash) సందర్భంగా గాయపడిన పోలీసు సిబ్బంది కుటుంబాలు తమకు న్యాయం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఏసీపీ కుమారుడు లక్ష్య, ఆయన భార్య భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. గాయపడిన పోలీసు అధికారుల గురించి ఎవరూ మాట్లాడటం లేదని, అందుకే కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఏసీపీ కుమారుడు లక్ష్య తెలిపారు.

“నా స్నేహితులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని లింకులలో పోలీసులను ప్రతికూలంగా చూపిస్తున్నారు. అయితే ఇలాంటి ఏకపక్ష మీడియా కథనాలను పట్టించుకోవద్దని తన  తండ్రి చెప్పినట్లు లక్ష్య పేర్కొన్నారు. గాయపడిన పోలీసుల గురించి పార్లమెంట్‌లో కూడా సరైన చర్చ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలలో కొందరు అల్లరి మూకలు ఉన్నారని, తన తండ్రి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావడం బాధాకరమని తెలిపారు.

ఏసీపీ భార్య మాట్లాడుతూ, జూలై 20 రాత్రి గాయాలతో ఇంటికి తిరిగి వచ్చిన తన భర్తను చూసిన క్షణం ఎంతో బాధాకరంగా, మానసికంగా కలచివేసిందని తెలిపారు. అలాగే, “ఈ రోజు గాయపడిన ఢిల్లీ పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి మా అనుభవాలను మీ అందరితో పంచుకోవడానికి వచ్చాం. విధి నిర్వహణలో గాయపడిన పోలీసుల కుటుంబాలు ఎదుర్కొన్న బాధను కూడా సమాజం గుర్తించాలి” అని ఆమె అన్నారు. గాయపడిన పోలీసుల సమస్యలపై కూడా చర్చ జరగాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

Also Read : తెలంగాణ‌లో స‌ర్ ప్ర‌క్రియ పొడిగింపు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>