‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీలను విజయవంతం చేయాలి: రాంనాథ్

కలం, నిర్మల్: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘హర్ ఘర్ తిరంగా’ (Har Ghar Tiranga) కార్యక్రమంలో భాగంగా నిర్మల్ (Nirmal) జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న తిరంగా ర్యాలీలను విజయవంతం చేయాలని కార్యక్రమ జోనల్ కన్వీనర్ రావుల రాంనాథ్ అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నివాసంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 13వ తేదీన జిల్లా కేంద్రంలో వేలాది మంది కార్యకర్తలతో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ జెండాను ఎగరవేయాలని, అలాగే ప్రతి ఒక్కరూ తమ వాట్సాప్ డీపీలు, సామాజిక మాధ్యమాల ప్రొఫైల్ చిత్రాలుగా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు సుంకరి సాయి, పట్టణ కౌన్సిలర్లు గంజి రాజు, జింక సూరి, శ్రీరామోజు నరేష్, సూరజ్ నాయక్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, నాయకులు సాత్విక్, అర్జున్, భరత్, విజయ్, దీక్షిత్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>