నిర్మల్​లో బీజేపీ మహిళా మోర్చా ఆందోళన

కలం, నిర్మల్ : మహిళా విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్‌ను పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా (BJP Mahila Morcha) ఆధ్వర్యంలో సోమవారం రాహుల్ గాంధీ, బిమోల్ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. మహిళా మోర్చా జిల్లా ఇంచార్జి సంగీత మాట్లాడుతూ.. జేఎన్‌యూలో మహిళా విద్యార్థులపై వేధింపులకు సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మహిళలపై వేధింపుల ఆరోపణల విషయంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని, సంబంధిత ఎంపీపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు బొప్పరపు సత్యవతి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుమల కల్పన, జిల్లా ఉపాధ్యక్షులు మమత, తోకల సరస్వతి, బీజేపీ సీనియర్ నాయకురాలు అలివేలు మంగ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>