కేంద్రం విధానాలపై వ్యవసాయ సంఘం పోరాటం

క‌లం, నిర్మల్: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం నిర్మల్ (Nirmal) జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని గాంధీ పార్క్‌లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రజాసంఘాల నాయకులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సురేష్, డాకూర్ తిరుపతి, గంగామణి నర్సయ్య, తొడసం శంబు, గంగారం, ముత్తన్న తదితర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>