Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రతిరోజు రాత్రి 3 గంటలకే మెలకువ వస్తోందా..? జర జాగ్రత్త

కలం, వెబ్ డెస్క్: కొంతమందికి ప్రతిరోజూ రాత్రి 3 గంటలకు మెలకువ రావడంతో (Nighttime Wake Ups) కలవరపడుతుంటారు. దీనిపై సోషల్ మీడియాలో ఆధ్యాత్మిక శక్తులు, హార్మోన్ల అసమతుల్యత అంటూ రకరకాల ప్రచారాలున్నాయి. అయితే.. దీని వెనుక ఉన్న అనేక విషయాలున్నాయని ముంబైలోని సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌ తెలిపింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రి వేళల్లో మెలకువ రావడం సాధారణమైన విషయమే. చాలామంది రాత్రిపూట చాలాసార్లు లేస్తుంటారు, కానీ మరుసటి రోజు ఉదయానికి ఆ సంగతి గుర్తుండదు.

ప్రతిరోజూ రాత్రి ఒకే సమయానికి నిద్రలేస్తూ, ఆ తర్వాత మళ్లీ నిద్రపోవడానికి ఇబ్బంది పడుతుంటే మాత్రం.. నిద్రకు ఆటంకమే అని చెప్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ‘ఒత్తిడి’ కావచ్చు. ఉదయం నిద్ర (Sleep) లేపడానికి ‘కార్టిసాల్’ అనే ఒత్తిడి హార్మోన్ తెల్లవారుజామున సహజంగానే ప్రభావం చూపుతుంది. కానీ దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళన, మానసిక అలసటతో బాధపడుతున్నప్పుడు మరీ ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఫలితంగా రాత్రి వేళల్లో మెలకువ వచ్చేలా చేస్తుంది. ఆందోళన, నిరాశ లాంటి సమస్యలు కూడా నిద్రపై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>