Mobile Popup Ad
Mobile Popup Ad

బాహుబ‌లి, RRR లాగే రావు బ‌హ‌దూర్ గురించి చెప్పుకుంటారు: స‌త్య‌దేవ్‌

క‌లం, వెబ్ డెస్క్: టాలెంటెడ్ డైరెక్ట‌ర్ వెంక‌టేశ్ మహా డైరెక్ష‌న్‌లో విల‌క్ష‌ణ న‌టుడు స‌త్య‌దేవ్ (Actor Satyadev) ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన తాజా చిత్రం రావు బ‌హ‌దూర్‌ (Rao Bahadur). డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన‌ ఈ సినిమా టీజ‌ర్‌ను మూవీ టీం నేడు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా స‌త్య‌దేవ్ మాట్లాడుతూ.. విదేశాల్లో టాలీవుడ్‌కు గొప్ప గుర్తింపు తీసుకొచ్చిన‌ బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ లాగే రావు బ‌హ‌దూర్ గొప్ప సినిమాగా నిలిచిపోతుంద‌న్నారు. ఇక వెంక‌టేశ్ మహా కంచ‌ర‌పాలెం, ఉమా మ‌హేశ్వ‌ర ఉగ్ర రూప‌స్య వంటి సినిమాలు తీసి ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌ గుర్తింపు సంపాదించుకున్నాడ‌ని చెప్పారు.

ప్ర‌తి ప్రేక్ష‌కుడు క‌చ్చితంగా ఈ డైరెక్ట‌ర్ సినిమా చూడాల‌నే జాబితాలో వెంక‌టేశ్ మ‌హా ఉంటార‌న్నారు. రావు బ‌హ‌దూర్‌కు ఎందుకు ఇంత టైం తీసుకున్నావ‌ని మ‌హాను అడిగితే త‌న జీవితంలో చాలా విలువైన స‌మ‌యాన్ని ఈ సినిమా కోసం ఖ‌ర్చు చేశాన‌ని చెప్పాడ‌న్నారు. ఏజ్ అయిపోతున్నా ఎదురు చూసి ఇంత గొప్ప సినిమా తీశాడ‌ని డైరెక్ట‌ర్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. అనురాగ్ శ‌ర‌త్‌, గోపాల కృష్ణ, వెంక‌టేశ్ మ‌హా, ఇంకా చాలా మంది సినిమా పిచ్చి ఉన్న వాళ్లు ఈ మూవీకి వ‌ర్క్ చేశార‌ని, ప్ర‌తి తెలుగు ప్రేక్ష‌కుడు గ‌ర్వంగా ఇది మా తెలుగు సినిమా అని చెప్పుకునే విధంగా రావు బ‌హ‌దూర్ ఉండ‌బోతుంద‌ని స‌త్య దేవ్ అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>