కలం, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ (NHRC) అయ్యింది. ఈ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్ ప్రమాదం (Visakhapatnam Steel Plant Explosion)పై 2 వారాల్లో భద్రతా లోపాలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గాయపడ్డ కార్మికుల పరిస్థితిపై ఆరా తీసింది. గాయపడ్డ వారికి ఇచ్చే పరిహారం వివరాలు అడిగిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. వెంటనే చెల్లింపుల వివరాలు సమర్పించాలని కోరింది. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9 మంది చనిపోగా, ఆరుగురికి తీవ్ర గాయాలు అయిన విషయం తెలిసిందే. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఉద్యోగుల సంఘం ఆరోపిస్తోంది.

