భార్య‌ స‌ర్పంచ్ ప‌ద‌వి కోసం భ‌ర్త‌ బంప‌రాఫ‌ర్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌ల సంద‌డి మొద‌లైంది. ఇంకా నామినేష‌న్లు కూడా ప్రారంభం కాక‌ముందే ఏక‌గ్రీవాల కోసం అభ్య‌ర్థులు బంపరాఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నారు. తాజాగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం మండ‌లం గొల్ల‌వానితిప్ప‌ (Gollavanitippa)లో స‌ర్పంచ్ ఎన్నిక‌ల వేళ ఓ వ్య‌క్తి ప్ర‌క‌టించిన ఆఫ‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. జ‌న‌సేన పార్టీకి చెందిన కొప్ప‌ర్తి శ్రీరామ్మూర్తి భార్య రామ‌ల‌క్ష్మి గొల్ల‌వానితిప్ప‌లో స‌ర్పంచిగా పోటీ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న భార్య‌ను ఏక‌గ్రీవంగా స‌ర్పంచిగా ఎన్నుకుంటే రెండెక‌రాల భూమి ఇస్తాన‌ని శ్రీరామ్మూర్తి ప్ర‌క‌టించారు.

అయితే రెండెక‌రాల భూమి ఓట‌ర్ల‌కు అనుకుంటే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్లే. గ్రామ పంచాయ‌తీకి రెండెక‌రాల భూమి ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. గ్రామంలో తీవ్రంగా వేధిస్తున్న తాగునీటి చెరువు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీరామ్మూర్తి వెల్లడించారు. ఇప్పటికే ఊరిలో పెద్ద స‌మావేశం ఏర్పాటు చేసి గ్రామ పెద్దలకు భూమి కేటాయింపు విషయాన్ని తెలియజేశారు. అయితే గ్రామ‌స్తులు ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>