కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసు (Moinabad Drugs Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ సింగ్ కనిపించడం లేదని అతడి తండ్రి రవిశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 14న బీఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరిగింది. పోలీసులు అదే రోజు రోహిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో అభిషేక్ సింగ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల 16 నుంచి తన కొడుకు కనిపించడం లేదని అభిషేక్ తండ్రి రవిశంకర్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రెండో రోజు కస్టడీ కొనసాగుతోంది. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో రోహిత్ రెడ్డి, రితేశ్, నమిత్‌లను సిట్ అధికారులు విచారించనున్నారు.
Read Also: ఇరాన్ నాయకత్వం బలహీనపడింది: డొనాల్డ్ ట్రంప్
Follow Us On: Instagram

