నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు టైరు పేలి ఇద్దరు మృతి

కలం, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Nellore Road Accident) రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కారు టైరు అకస్మాత్తుగా పేలడంతో అదుపుతప్పిన వాహనం ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళతో పాటు మరో వ్యక్తి మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన అనంతసాగరం మండలం యాకర్లపాడు సమీపంలోని హైవేపై చోటుచేసుకుంది.

అందిన సమాచారం ప్రకారం.. తిరుపతి నుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి కారులో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. యాకర్లపాడు సమీపానికి చేరుకోగానే కారు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో కారు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న మహిళతో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు మిగిలిన నలుగురు కూడా గాయపడటంతో హైవేపై కొద్దిసేపు కలకలం నెలకొంది.

సమాచారం అందుకున్న స్థానికులు, సంబంధిత సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతులు, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో శ్రీశైలం దర్శనానికి వెళ్తున్న వారి ప్రయాణం విషాదాంతంగా మారింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>