epaper
Tuesday, March 3, 2026
epaper

వివాదాస్పదంగా ఎమ్మెల్యే కొలిక‌పూడి ప్రవర్తన

కలం, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్(NTR)  జిల్లాలోని గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో జరిగిన శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈసారి భక్తి వాతావరణంతో పాటు రాజకీయ వివాదానికి దారి తీసింది. వేడుకలో భాగంగా స్వామివారికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాలను ఎంపీ కేశినేనీ శివనాథ్ (Kesineni Sivanath)  తలపై ఉంచి సమర్పించే సంప్రదాయం కొనసాగుతుండగా, ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస రావు (Kolikapudi Srinivasa Rao)  ఆ వస్త్రాలను ఒక్కసారిగా లాక్కోవడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ చర్యను చాలా మంది అనుచిత ప్రవర్తనగా భావించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు సంయమనం పాటిస్తూ భక్తుల మధ్యే కూర్చొని కళ్యాణ మహోత్సవాన్ని శాంతియుతంగా కొనసాగించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!