నీట్ స్టూడెంట్స్ కోసం NTA సంచలన నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జరగబోయే నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఒక నోటీస్‌ను విడుదల చేసింది. పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు నీట్ (NEET) పరీక్ష రాయబోయే స్టూడెంట్స్ కోసం పరీక్ష సమయాన్ని 15 నిమిషాలకు పెంచింది. ఈ నిర్ణయంతో పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు నిర్వహించబడుతుంది.

సంతకాలు, ఇన్విజిలేషన్ వంటి ముందస్తు పరిపాలనా ప్రక్రియల వల్ల విద్యార్థులు తమకు కేటాయించిన రాసే సమయాన్ని నష్టపోకుండా ఉండేందుకే ఈ అదనపు సమయాన్ని ఇచ్చింది. అలాగే ప్రశ్నాపత్రం బుక్‌లెట్‌లో రఫ్ వర్క్ చేసుకునే స్థలాన్ని రెండింతలకు పెంచింది. విద్యార్థులు లెక్కలు, ఇతర చిత్రాలు గీసుకోవడం కోసం నాలుగు పేజీలను కేటాయించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>