సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం : శ్రీహరి రావు

కలం, నిర్మల్ : సీఎంఆర్‌ఎఫ్‌ (CMRF) పేదలకు వరమని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ (Nirmal) నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నియోజకవర్గంలోని 40 మంది లబ్ధిదారులకు రూ.10.40 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూనే, నిరుపేదలకు వైద్య ఖర్చుల భారం పడకుండా సకాలంలో సీఎంఆర్ఎఫ్ ఫండ్ కింద నిధులు విడుదల చేస్తోందని తెలిపారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యచికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>