కలం, వెబ్ డెస్క్ : నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి (Narketpally) శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నార్కట్‌పల్లి – అద్దంకి రహదారిపై రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక డీసీఎం వాహనాన్ని మినీ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, బస్సులో ప్రయాణిస్తున్న 13 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు మినీ బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన మినీ బస్సు అరుణాచలం నుండి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

