ఎరువుల దుకాణాల్లో నారాయణ‌పేట కలెక్టర్ తనిఖీలు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నారాయణపేట (Narayanpet) జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో ఆగ్రో, హాకా రైతు సేవా కేంద్రాలను శనివారం కలెక్టర్ సీహెచ్.ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా దుకాణాల్లో పత్తి విత్తనాల ప్యాకెట్లు, ఇతర రసాయనిక ఎరువులు, పురుగుల మందులను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లను చెక్ చేశారు. ఈ సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయా.. లేదా.. అని డీలర్లను అడిగి తెలుసుకున్నారు. గోదాముల్లో నిల్వ ఉంచిన యూరియా బస్తాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియా నాయక్, ధన్వాడ తహసీల్దార్ సింధూజ, ఎంపీడీవో అబ్జల్, ఏవో నవీన్ కుమార్, ఆర్ఐ నిఖిల్, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>