Mobile Popup Ad
Mobile Popup Ad

రేపు సీఎం చంద్రబాబు బ‌ర్త్ డే.. నారా భువ‌నేశ్వ‌రి కీల‌క నిర్ణ‌యం

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏప్రిల్ 20వ తేదీన‌ ఏపీ సీఎం చంద్ర‌బాబు (Chandrababu) బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న భార్య నారా భువ‌నేశ్వ‌రి (Nara Bhuvaneswari) కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. త‌మ‌కు ఎంతో ప్ర‌త్యేకమైన రోజు సంద‌ర్భంగా పేద‌ల ఆక‌లి తీర్చేందుకు గొప్ప‌ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టేందుకు నిర్ణ‌యించారు. రోజూ ఏపీలో ఎంతోమంది క‌డుపు నింపుతున్న అన్న‌ క్యాంటీన్ల‌ (Anna Canteens)కు నారా భువ‌నేశ్వ‌రి భారీ విరాళాన్ని ప్ర‌క‌టించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న‌ క్యాంటీన్ల‌లో ఉచితంగా భోజనం అందించేందుకు రూ.76 ల‌క్ష‌ల విరాళం అంద‌జేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ న‌గ‌దుకు సంబంధించిన‌ చెక్కును అన్న‌ క్యాంటీన్ సీఈవోకు భువనేశ్వరి అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు కూడా ఉన్నారు. దీంతో రేపు (సోమ‌వారం) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్ల‌లో ఉచిత భోజ‌నం అందించ‌నున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>